సంక్రాంతి పండగ హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగ.. సంక్రాంతి అంటేనే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, కొత్త సినిమాలు, ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు ఇలా సందడే సందడి. కొత్త అల్లుడికి ఈ పండగ సమయంలో జరిగే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిని ఆహ్వానించడం దగ్గర నుంచి ఆహారం అందించే వరకూ వెరీ వెరీ స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో ఓ కొత్త అల్లుడుకి 108 రకాల పిండి వంటలతో ఓ రేంజ్ లో భోజనం పెట్టి వార్తల్లో నిలిచారు.