కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రయంలో సమోసా తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో సోమవారం ముగ్గురు చనిపోయారు.