ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురు గాలుల భీభత్సం సృష్టించాయి. ఇసుక తుఫానును తలపించిన ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురిసింది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు ఈ గాలులకు చెదిరిపోయాయి. టెంట్లు, కుర్చీలు చిందరవందర అయ్యాయి. క్రీడాకారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ గోడం నగేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.