దేశమంతా నాగుల పంచమి… అక్కడ మాత్రం తేళ్ల పంచమి..! అదేంటో చూస్తే అవాక్కే..

తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులు నాగుల పంచమి సందర్భంగా నాగు పాములకు పూజలు చేస్తే... ఇక్కడ మాత్రం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు. అలాగే కొండపై తేళ్లకు పూజ చేస్తు, తేళ్లను ఇలవేల్పుగా కొలుస్తున్న విచిత్రమైన సంప్రదాయం కొనసాగిస్తున్నారు భక్తులు.