నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోం తో చర్చలు జరిపారు.