నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు ఆదివారం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.