ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలు పల్లెలను పట్టిపీడిస్తున్నాయి. చేతబడి చేస్తున్నాడనే నెపంతో వ్యక్తిపై దాడి చేయగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష పడిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు వారి కుమారుడు ఉన్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్‌పూర్‌కు చెందిన రాజేష్ తల్లి 2017లో బాత్‌రూమ్‌లో పడి కాలువిరిగి కొద్ది రోజులకు చనిపోయింది. ఆమె చనిపోయిన 9నెలలకు తండ్రి అయ్యన్న ఆకస్మికంగా చనిపోయాడు. అయితే, ఇంటి పక్కనే ఉండే సీస యాదగిరి (85) చేతబడి చేశాడని, తన తల్లిదండ్రులు చనిపోవటానికి యాదగిరి కారణమని రాజేష్ అతనిపై కక్ష పెంచుకున్నారు.