అశ్వాలపై విశ్వాసం.. ప్రతి ఏటా ఘనంగా గుర్రాల పార్వేట

కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో యాదవ రాజులు గా పిలవబడే రాజవంశీకులు గుర్రాల పారువేట అత్యంత ఆకర్షణీయంగా అలనాటి రాజరికం ఇప్పటికీ కనిపిస్తుంది. అసలు ఈ గుర్రాల పారువేట అంటే ఏమిటి.. సిసలైన గుర్రాల పారువేట గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ప్రతి ఏటా దసరా పండుగ రోజున ఈ గుర్రాల పారువేట ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్వం అలనాటి రాజవంశీకులకు చెందిన పెద్ద నగిరి, చిన్న నగిరి, వేమన నగిరి,లకు చెందిన మూడు రాజరిక కుటుంబాలు విజయదశమి దీనిని నిర్వహిస్తారు.