ఏలూరు: భార్య - భర్తల మధ్య గొడవలు పిల్లల ప్రాణం తీయటం చూశాం.. అత్తమామలను చంపిన కేసులు చదివాం.. ఇంకా ఎన్నో అఘాయిత్యాల గురించి తెలుసుకున్నాం.. కానీ పెంపుడు జంతువులను సైతం తమ కక్షలకు బలితీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. రోజూ లీటర్లకొద్దీ పాలు ఇచ్చే మూడు గేదెలను అత్యంత కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపింది.