పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్​లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పహాడీషరీఫ్‌లోని ఒక పెళ్లి డెకరేషన్ సామాగ్రికి సంబంధించిన గోడౌన్​లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సామాగ్రి అంటుకొని దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.