తాటి చెట్లు.. ఈత చెట్లకు కల్లు రావడం సహజం. అక్కడక్కడా వేప చెట్లకు కళ్ళు వచ్చిన సంఘటనలు కూడా చూశాం. కానీ అదే విచిత్రమో..! చింతచెట్టుకు కల్లు రావడం జనాన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఆ కళ్లు తాగి లొట్టలేస్తున్న జనం అంతా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం లీలే అంటున్నారు. సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుంది. ఇక్కడ చింత చెట్టు నుంచి కల్లు కారడం ఏమిటో అంతుబట్టడంలేదంటున్నారు స్థానికులు. ఇలాంటి దృశ్యాన్ని తాము గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు.. కొందరైతే ఏకంగా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు.. బ్రహ్మంగారు చెప్పినట్లు లోకంలో ఎంతో వింతలు జరిగిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.