డీజే టిల్లు పాటలతో దుమ్మురేపిన ఖాకీలు..!

ఎప్పుడు కంటి మీద కునుకు లేకుండా గడిపే పోలీసులు ఆటాపాటలతో అదరగొట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే తోసహా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ మీట్ జరుపుకున్నారు.