మంచి వ్యూతో హైదరాబాద్‎లో ప్రారంభానికి సిద్దంగా మరో ఫ్లై ఓవర్..

హైదరాబాద్ మెడలో మరో మణిహారాన్ని బైరామల్ గూడ ఫ్లైఓవర్‎తో అలంకరించబోతున్నారు. ఈ ఫ్లైఓవర్ 780 మీటర్ల పొడవుగా విస్తరించి ఉందని చెబుతున్నారు అధికారులు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ ఫ్లైఓవర్, ఎల్ బి నగర్ పరిధిలో నిర్మించేందుకు చేపట్టిన ప్రణాళికల్లో ఒకటి. మొత్తం 14 నిర్మాణాలలో ఈ ఫ్లైఓవర్ ఆరవది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులతో పాటు ఇతర వ్యయాలు కలుపుకొని రూ. 448 కోట్లతో చేపట్టారు.