హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో అర్థరాత్రి వరకు జరిగే వివాహాలపై ఇక్కడి ముస్లిం మత పెద్దలు మండిపడుతున్నారు. రోజంతా చాలదు అన్నట్లు అర్ధరాత్రి సమయంలో పెళ్లి తంతు పెట్టుకుని వీధుల్లో నానా హంగామా సృష్టిస్తున్నారని, దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిడ్‌నైట్ తర్వాత జరిగే వివాహాలకు తామెవరం వెళ్లడం లేదని, అలాంటి వాటిని ప్రోత్సహించేది లేదని తేల్చి చెబుతున్నారు.