భాయ్ ఇంటి వద్ద ప్రత్యక్షమైన ఐదడుగుల పాము!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద సోమవారం (మే 18) సాయంత్రం పాము కలకలం సృష్టించింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఆయన ప్రసిద్ధ గెలాక్సీ అపార్ట్‌మెంట్ ఆవరణలో సుమారు ఐదు అడుగుల పొడవున్న పాము ప్రత్యక్షం కావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్ పరిసరాల్లోని కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఒక షట్టర్ లోపల ఈ పాము దాక్కున్నట్లు గుర్తించారు. అపార్ట్‌మెంట్ వద్ద డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కాటే అప్రమత్తమై, వెంటనే స్నేక్ రెస్క్యూ నిపుణుడు విక్కీ దూబేకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న విక్కీ దూబే, చాకచక్యంగా ఆ పామును బంధించారు.