మద్దురమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది

కర్నాటకలోని హుస్కూర్ మద్దురమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. ఆలయ రథం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి నిన్న సాయంత్రం రథం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో లోహిత్, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది.