భక్తులతో కిక్కిరిసి మల్లన్న ఆలయం.. దర్శనానికి 6 గంటల సమయం

శ్రీశైలం కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తజనం పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించి మల్లన్న దర్శనానికి ఆలయానికి చేరుకుంటున్నారు. అంతేకాదు గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. కార్తీక మాసం సోమవారం కనుక భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శ దర్శనం నిలిపి వేసి కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచియున్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.