టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీ వేదికగా జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. తద్వారా 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు.