బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుండి మంగళూరు వెళ్తున్న రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో, ఒక ప్రయాణికుడు రైల్లోంచి ప్లాట్‌ఫారమ్ మీదకు వేలాడుతున్నాడు. అతడు పట్టాలపై పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు..అతను రైలు కింద పడబోతున్న సమయంలో అక్కడే ఉన్న మాజీ సైనికుడు సతీష్, రైల్వే సిబ్బంది ప్రదీప్ కుమార్ అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు.