ఓ వైపు భారీ వర్షం.. ఆపై ఘాట్ రోడ్డులో యువకుల వెకిలి చేష్టలు

తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రం.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రదేశాన్ని ఇలా వైకుంఠంగా భావిస్తారు. ఏడు కొండల మీద కొలువైన కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి భక్తులు భక్తి శ్రద్దలతో వెళ్తారు. శ్రీనివాసుడి దర్శనం కోసం మెట్ల మార్గంలోనే కాదు వాహనాలల్లో ఘాట్ రోడ్డుమీద కూడా ప్రయాణించి తిరుమల క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే తాజాగా తిరుమల ఘాట్ రోడ్డుమీద ఓ ఆకతాయి బృందం నానా హంగామా చేసింది. తోటి భక్తులకు ఇబ్బందులకు గురి చేసింది.