మహానగరంలో కంత్రీగాళ్లు.. అందుకోసం స్ట్రీట్ లైట్లు ఆఫ్ చేసి..!

హైదరాబాద్ మహానగరం మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీకి చెందిన ఓ యువతిని గత కొంత కాలంగా విశాల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. పదే పదే ఇదే జరుగుతుండడం, ఆకతాయి వేధింపులు భరించలేకపోవడంతో యువతి విషయాన్ని తన తండ్రికి తెలిపింది. కన్నకూతురి పట్ల ఇలా ప్రవర్తించిన వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆ తండ్రి యువకుడిని చితకదాబాడు. ఇది ఓర్చుకోలేని ఆ యువకుడి స్నేహితులు.. యువతి కుటుంబ సభ్యులపైకి ఎదురుదాడికి దిగారు.