నడిరోడ్డుపై స్కూటీ పడేసి.. హాయిగా నిద్రపోతున్న మందుబాబు

ఒళ్లు తెలియకుండా ఫుల్‌గా మద్యం తాగాడు ఓ వ్యక్తి. ఇక ఎక్కిన మందు కిక్‌ ఇచ్చిందేమో మరి.. నాకెవరు అడ్డు చెప్పేది. నన్ను ఎవరు ఆపేది అని అనిపించిందేమో తెలియదు కానీ నడి రోడ్డుపై స్కూటీని పడేశాడు. ఇక ఒక్కటే పని. ఏంటా అనుకుంటున్నారా..! ఫుల్‌గా నిద్రపోవడం. ఎన్ని వాహనాలు రోడ్డుపై వెళ్తున్న అతని నిద్రకు మాత్రం భంగం కలగలేదు. ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో జరిగింది. కాగా, ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.