వైఎస్ షర్మిలతో భేటీ అయిన వివేకా కుమార్తె సునీత

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..