వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు గట్టిషాక్‌..! - TV9

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు దెబ్బలమీద దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ బీఆర్‌ఎస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి కొండా సురేఖ దయాకర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.