బెంగుళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి విడుదలైన హేమ.. వీడియో వైరల్

బెంగుళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి విడుదలైన హేమ.. వీడియో వైరల్ బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెకు బెంగుళూరు కోర్టు గురువారం షరుతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఆమె శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. హేమ నుంచి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.