మంచిర్యాల జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర ప్రాణహిత దాటి జిల్లాలోని అడవుల్లోకి ఎంట్రీ ఇస్తున్న పులులు ఆహారం కొసం అడవిలోకి వెళ్లిన పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లి అటవిప్రాంతంలో చోటు చేసుకుంది. పులి రాకను గమనించిన పశువుల కాపారి ప్రాణభయంతో సమీపంలోని చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా.. కళ్ల ముందే పులి పశువుల మందపై దాడి చేసి ఓ పశువును గాయపరిచింది. ధైర్యం చేసి పులి కదలికలను తన ఫోన్ లో బందించిన పశువుల కాపరి సమాచారాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. గ్రామస్తులు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ ఘటన స్థలానికి చేరుకోవడంతో పులి అక్కడి నుండి పారిపోయింది.