ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా.. కదిలిరా సభలతో కేడర్‌లో జోష్ పెంచుతున్నారు.