స్టైలిష్ లుక్‌లో ప్రధాని మోదీ.. యుద్ద సైనికుడిగా అవతారమెత్తిన వీడియో వైరల్

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు యుద్ద సైనికుడిగా అవతారమెత్తారు. లైట్ గ్రీన్ కలర్ డ్రస్సు వేసి.. కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టి.. చేతిలో హెల్మెట్ పట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. హాలీవుడ్ హీరో లెవెల్లో నడుచుకుంటూ వస్తున్న నరేంద్ర మోదీని చూసి అందరూ షాక్‌కి గురయ్యారు.