ప్రస్తుతం దేశవ్యాప్తంగా రీల్స్ కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. లైక్, వ్యూస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్లు అయిపోవడానికి ప్రాణాలకు సైతం తెగించి ప్రమాదకర స్టంట్లు చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కొందరు యువత చదువును సైతం పక్కన పెట్టి రీల్స్ తయారీపై బిజీ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాక చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటి మాయలో పడిపోయారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఎంతకైనా దిగడానికి సిద్ధమైపోతున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చేస్తూ ఆరో అంతస్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. ప్రమాదం దాటికి ఒంట్లో ఎముకలు ఫట్ ఫట్ మంటూ విరగడంతో బాధతో విలవిల లాడింది.