65 మంది అమ్మాయిలు, అబ్బాయిలు.. అంతా గుట్టుగా ఫామ్‌హౌస్‌కు వచ్చారు..

నిండా 20 ఏళ్లు కూడా నిండా నిండని పిల్లలను పార్టీ పేరుతో ట్రాప్‌ చేసి, మత్తులో ముంచిన బద్మాష్‌ బాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ చెర్రీ ఓక్స్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59మంది స్టూడెంట్స్ ఉండగా అందర్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.