ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు నమోదు..

ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు నమోదు.. తెనాలిలో పోలింగ్‌ రోజు జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యేకి ఓటరుకి జరిగిన ఘర్షణలో ఇద్దరూ చెంపదెబ్బలు కొట్టుకోవడం.. వెంటనే ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాదడం జరిగిపోయాయి. తెనాలిలో జరిగిన ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా.. పోలింగ్‌ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది..