దేశ రాజధాని ఢిల్లీ.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హస్తినలో వాయు కాలుష్యం లెవెల్స్.. ఆయువు తీసే రేంజ్‌కి చేరాయి. దాంతో, ఢిల్లీలో బతకడం.. ప్రాణాలతో చెలగాటంలా మారుతోంది. దీపావళి వేళ ఢిల్లీ అంతటా విషపూరిత పొగ మేఘాలు కమ్మేశాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో సగటున 556గా నమోదైంది.. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఢిల్లీ ప్రజలు.