అక్కడ జవాన్.. ఇక్కడ కిసాన్.. వేటగాళ్ల వలలో ఒకేరోజు ఇద్దరు బలి.. అటవీ జంతువుల వేట అమాయకుల ప్రాణాలు మింగేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఓ చోట గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బలి కాగా.. మరోచోట యువరైతు వేట గాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.