ఎన్నికల ముందే ప్రజల సమస్యలు తీరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి.. ఎక్కడంటే

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం ప్రధాన సమస్య ఒక్కటేఏ.. అదే కోతుల సంచారం. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఈ సమస్య ఉంది. దీంతో గ్రామాల్లోకి ఓట్లు అడిగేందుకు వెళ్లే ప్రతి అభ్యర్థికి ఒకే డిమాండ్ ఎదురైంది. తమ గ్రామంలోంచి కోతులను వెళ్లగొడితే మీకు ఓట్లు వేస్తామని జనాలు చెప్పడంతో.. అభ్యర్థులు కూడా అందుకు అంగీకరించి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇలానే హామీ ఇచ్చిన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిరంజీవులు.. పోలింగ్‌కు ముందే తను ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నాడు.