విరించి ఆసుపత్రి ఇప్పటికే అనేక సంక్లిష్టమైన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. తల్లి నుండి కొడుకుకు, భార్య నుండి భర్తకు ABO అననుకూల మూత్రపిండ మార్పిడి, బయాప్సీ-నిరూపితమైన త్రోంబోటిక్ మైక్రోఅంజియోపతితో ఉన్న రోగికి మూత్రపిండ మార్పిడి వంటివి ఇందులో ఉన్నాయి. భారతదేశంలోనే మొదటిసారిగా ఒకే సమయంలో కిడ్నీ, హృదయ అవయవ మార్పిడి చేసిన ఘనత విరించి హాస్పిటల్ సొంతం.