నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఉత్సవాలకు ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తారు. ఈ కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు దేవస్థానం అర్చకులు, ఆలయాధికారులు. ఈ సమావేశం బాగల్కోట్ జిల్లా రబ్బని పట్టణంలో శ్రీదానేశ్వరీ కల్యాణమండపంలో జరిగింది.