ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించకపోవడంతో చంద్రగిరి స్మశానం వాటిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుధా యాదవ్. చనిపోయిన వారి సమాధుల వద్ద ప్రచారంలో భాగంగా వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి తనుకు ఓటే వేయాలని కోరారు. చంద్రగిరి నుంచి టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్న బిసి నేత బడి సుధా యాదవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, బోగస్ ఓట్లను తొలగించాలని ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.