తుపాన్ ఎఫెక్ట్ వారం రోజులుగా తీరప్రాంత ప్రజలకు, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిని మిగ్ జాం తీవ్ర తుపాన్ బాపట్ల జిల్లా చీరాల సమీపంలో తీరం దాటి బీభత్సం సృష్టించింది. రైతుల ఆశలను అడియాసలు చేస్తూ....పంటలను తుడిచిపెట్టేసింది. వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 7వేల కోట్లకుపై నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు తీరప్రాంత గ్రామాలు వణికిపోయాయి. మిగ్ జాం తుపాన్ తో రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారు.