బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు కుక్కకు కుక్క వంటి పిల్లి పిల్లలు పుట్టాయి. ఒక ఆడ కుక్క పిల్లిలాంటి రెండు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. వీటి స్వరం, చర్యలు, కూడా సరిగ్గా పిల్లి పిల్ల వలనే ఉన్నాయి. ఆ ఆడ కుక్క ఎవరినీ తన దగ్గరకు రానివ్వడం లేదు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ కుక్కపిల్లలను చూసేందుకు కుక్క యజమాని ఇంటికి ప్రజలు బారులు తీరారు.