అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

ఎమ్మిగనూరు సీఎం జగన్ బస్సుయాత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆయన్ను చూసేందుకు వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో పేషెంటు ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది. అయితే అంతమంది ప్రజల్లో ఎక్కడా చిక్కుకోకుండా ముందుకు సాగిపోయింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సీఎం జగన్ సిద్దమయ్యారు. ప్రచారంలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు.