ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యా్న్స్ హల్ చల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటి వద్ద ఆయన అభిమానులు హల్ చల్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో డార్లింగ్ ఇంటి వద్ద ఈరోజు తెల్లవారుజామునే భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికి వెళ్లేందుకు అభిమానులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా, అభిమానులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రభాస్ ను కలవాలంటూ వారంతా రోడ్డుపై బైఠాయించడంతో చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు ప్రభాస్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.