చిన్ననాటి నుండి చిత్రలేఖనంపై ఎక్కువ మక్కువతో తానంతటతానే చిత్రలేఖనంలో ఎదుగుతుంది. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన నామోజు లావణ్య బీకాం పూర్తి చేసిన లావణ్య చిత్రలేఖనాన్నే తన వృత్తిగా మలుచుకుంటుంది. ఇప్పటికే కొలతలు లేకుండా ఫ్రీ హ్యాండ్ చిత్రాలు గీయడంలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆయిల్ పెయింట్స్ తో పాటు యాక్రిలిక్ మిక్స్ ను కాన్వాస్ పై రకరకాల రంగులతో చిత్రాలను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు.