నోట్ల వర్షం కురుస్తుందంటే.. పరిగెత్తిన జనం !

మహారాష్ట్రలోని అహల్యానగర్‌లో 'నోట్ల వర్షం' కురిపిస్తామని, డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడుతున్న ఒక కేటుగాళ్ల ముఠా గుట్టును లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB) పోలీసులు రట్టు చేశారు. ఈ మెరుపు దాడిలో రూ. 93 లక్షల విలువైన నకిలీ భారతీయ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.