అక్రమించిన చెరువులను అప్పజెప్పండి.. లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః రేవంత్‌రెడ్డి

అక్రమించిన చెరువులను అప్పజెప్పండి.. లేదంటే ఉన్నపళంగా నేలమట్టం చేస్తాంః రేవంత్‌రెడ్డి దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి.. అందుకే హైడ్రాను ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమించిన వాళ్లలో ఎంత గొప్ప వాళ్లు ఉన్నా వాళ్లు చెరువులను వదలక తప్పదని హెచ్చరించారు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.