కరోనా పుణ్యమా అని.. అప్పటి నుంచి నిత్యవసరాల ధరలు ఆకాశాన తిష్టవేశాయి. కూరగాయల నుంచి సరుకుల వరకు ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మహానుభావుతు ఉచితంగా కూరగాయలు పంచాడు. ఇక ఈ విషయం తెలుకున్న జనం ఊరుకుంటారా.. సంచులు ఎత్తుకొచ్చి ఎగబడి మరీ టన్నుల కొద్దీ కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లారు. ఎక్కడో అనుకుంటే పొరబాటే.. సాక్షాత్తు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం (ఆగస్టు 27) ఉదయం ఈ పంఘటన చోటు చేసుకుంది.