సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు.. వలలోపడ్డ భారీ తిమింగలం..

విశాఖ తీరం నిరంతరం అనేక వింతలు, విశేషాలకు వేదిక అవుతూనే ఉంది. రకరకాల సముద్ర జీవులు వివిధ రకాల కారణాలతో ఒడ్డుకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. సముద్ర విజ్ఞానంపై ఆసక్తి ని మరింత పెంచుతూనే ఉంటాయి. వింతైన చేపల నుంచి ఇటీవల తీరం వెంబడి జెల్లీ ఫిష్‎ల ఉనికి వరకూ, తాజాగా సముద్రపు తాబేళ్లు నుంచి తిమింగలాలు వరకూ నిరంతరం విశాఖ తీరంలో ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తూనే ఉన్నాయి.