అర్ధరాత్రి తోపుడు బండ్లపై చీప్‎గా ఏంటి ఆ పని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్టు దొంగలు ఈ మధ్య వెరైటీగా చేతివాటం చూపుతున్నారు. చడ్డి గ్యాంగ్ మాదిరి ఇప్పుడు ముసుగులు వేసుకొని అర్థ రాత్రులు వెరైటీ దొంగతనాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గత కొద్ది రోజులుగా రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లపై పండ్లు మాయం అవుతున్నాయి. ఉదయం వచ్చి చూసే సరికి అరటి పండ్లు మాయం అవుతున్నాయి. తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముకొని జీవనం సాగించే చిరు వ్యాపారులకు ఏమి జరగుతుందో తెలియక తల పట్టుకుంటున్నారు.