కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు.