అందమైన విశాఖలో సముద్రతీరాన సువిశాలమైన గెస్ట్ హౌస్ అది. ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫామ్ హౌస్ లా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఇది. సాధారణంగా అతిథులకు మాత్రమే ప్రవేశం ఉండే ఆ గెస్ట్ హౌస్ లోకి ఓ కింగ్ కోబ్రా అతిధిలా ప్రవేశించింది. ఎవరికీ తెలియకుండా అతిధి గృహం లోని ఒక బెడ్ రూం కు వెళ్ళింది.