ఆ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడ ఫిజిక్స్ కాకుండా చూసుకోండి

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా జరిగిన 'బ్యాండ్ మేళం' సినిమా టీజర్ లాంచ్ వేడుకలో ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవిల పెయిర్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కపుల్‌ను చూసి మురిసిపోయిన తమన్.. సరదాగా "మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది, కానీ ఆ కెమిస్ట్రీ కాస్తా ఎక్కడ ఫిజిక్స్ కాకుండా చూసుకోండి" అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పంచ్ వేశారు.